నటసింహ బాలకృష్ణకు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ తో స్వాగతం పలికింది. వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాలయ్య నటించిన సినిమాలలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టాప్ మూవీగా రికార్డుకెక్కింది. అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఆయన.. వీరసింహారెడ్డితో అంతకు మించిన హిట్టందుకున్నాడు.
సంక్రాంతి సినిమాగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే మూవీ టీమ్.. సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరుతెచ్చుకున్న బాలయ్యకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది.
అందుకే మాస్ బ్లాక్‌బస్టర్ పేరుతో ఈ వేడుకను నిర్వహించింది మూవీ టీమ్. అయితే బాలయ్య ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ వేరే లెవల్లో ఉంటాయన్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ఈవెంట్లోనూ ఆయన తన మార్క్ ఉత్సాహంతో సందడి చేశారు. ఇక ఈ వేడుకలో టీమ్తో పాటు యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్ధుజొన్నలగడ్డతోపాటు దర్శకులు హరీష్‌శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి,శివ నిర్వాణ కూడా హాజరై ఎంజాయ్ చేశారు.
మొత్తంగా ఈ ఈవెంట్ అంతా సందడి సందడిగా సాగింది. దీని తర్వాత వీరంతా కలిసి ఓ స్పెషల్ పార్టీ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను హీరో విశ్వక్ సేన్ తన ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ఓ ఫొటోలో బాలయ్య, వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజ్తో కలిసి కిరాక్ పోజులో కనిపించారు. ఇద్దరి చేతుల్లో డ్రింక్ గ్లాసులు కనిపించాయి.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంకా చెప్పాలంటే ఆ ఈవెంట్కే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ అయితే.. ‘చేతిలో గ్లాసు.. పక్కన హనీ రోజు’ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీర సింహారెడ్డి విషయానికొస్తే..గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడీగా శ్రుతిహాసన్, హనీరోజ్ నటించారు.
దునియా విజయ్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.