టైటిల్ కు తగ్గట్టే అన్ స్టాపబుల్ లా దూసుకుపోతున్నాడు నందమూరి అందగాడు బాలయ్య. ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు క్యాన్సర్ హాస్పిటల్ ఇలా సింగిల్ హ్యాండ్ తో అన్ని పనుల్ని చక్కబెట్టుకుంటూనే.. మరోవైపు అన్ స్టాపబుల్ షోని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాడు.
వారం వారం ఎనర్జిటిక్ గెస్టులను తీసుకొస్తూ.. ఫుల్ జోష్ తీసుకొస్తున్నాడు. రీసెంట్ గా లైగర్ టీంతో సందడి చేసిన బాలయ్య.. ఈ వారం ఎవరినిఆహ్వానిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ వారం ఎవరితో షో నడిపించాడో తెలియదు కానీ.. షో తర్వాత మాత్రం సర్ ప్రైజ్ చేశాడు. షో ముగిసిన తర్వాత లంచ్ టైమ్ కు ఇంటికి వెళ్తూ… తన వంట వాడికి ఏం కూర వండాలి అనే విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పి.. నవ్వులు పూయించాడు బాలకృష్ణ.
ఇందుకు సంబంధించిన వీడియోను ఆహా టీమ్ యూట్యూబ్లో అప్ లోడ్ చేసింది. తన వద్ద సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న వంట వ్యక్తికి ఫోన్ చేసిన ఆయన.. ఫుడ్ మెనూ చెప్తూ హడావిడి చేశాడు.ఈ వీడియోను ఆహా టీమ్ షేర్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అర మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మాత్రం ఆసక్తి రేపుతోంది.