తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను కలిశారు టిడిపి ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ నడిపిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ అలాగేరీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాల గురించి మంత్రి హరీష్ రావుకి వివరించారు బాలకృష్ణ.
అలాగే హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన అంశాలను కూడా బాలయ్య మంత్రి హరీష్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం తగిన సహాయం ఇవ్వాలని కోరారు బాలయ్య. హరీష్ కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.