నందమూరి బాలకృష్ణ” ఈయన సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు పండుగే. కథ ఏ విధంగా ఉన్నా సరే బాలయ్య నోటి నుంచి వచ్చే డైలాగులకు ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇటీవల వచ్చిన అఖండ సినిమా బాలయ్య ఫాన్స్ కు మంచి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాలకు సంబంధించి మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
Also Read:కొనే దిక్కులేదు..!
ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎలా ఉంటుంది ఏంటీ అనేది త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య పేరిట ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మావయ్య సినిమా మొదటి వారం కోటికి పైగా వసూలు చేసింది. కోటి 16 లక్షల 32 వేల 692 రూపాయలు వసూలు చేసింది. బ్రహ్మం గారి చరిత్ర సినిమా తర్వాత అంతటి భారీ ఓపెనింగ్స్ వచ్చిన సినిమా ఇదే.
ఇక ఆ తర్వాత భలే దొంగ సినిమా కోటి 11 లక్షల 24 వేలకు పైగా వసూలు చేసింది. ఇక బాల గోపాలుడు సినిమా కోటి 36 లక్షల 54 వేల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వసూళ్లు అయితే 50 నుంచి వంద కోట్లు ఉంటాయంటున్నారు సినిమా పండితులు. ఇటీవల ముద్దుల మావయ్య సినిమా 33 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇలా ఒకే ఏడాది మొదటి వారం మూడు సినిమాలు కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన మొదటి హీరో బాలయ్యే.
Also Read:రాఖీబాయ్‌గా కోహ్లీ.. ఆర్సీబీ-కేజీఎఫ్2 టీజర్ అదుర్స్