నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే రాయలసీమలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు అంటే చాలు అభిమానులు పడి చచ్చిపోతారు. తెలంగాణా, కోస్తా కంటే సీడెడ్ లోనే ఆయనకు మంచి రికార్డులు ఉన్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల కంటే కూడా ఆయనకు ఆ జిల్లాలలోనే ఫ్యాన్స్ కూడా ఎక్కువ. బాలయ్య సినిమాలకు అక్కడే వసూల్లు కూడా ఎక్కువ.
Also Read:భారతీయ విద్యార్థులపై ఉక్రెయిన్ పోలీసుల క్రూరత్వం
కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బాలయ్యకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. లెజెండ్ అయితే ఏకంగా కడప కర్నూలు జిల్లాల్లో రెండు సెంటర్లలో… 400 రోజుల పాటు ఆడింది. కడప లో ఒక సెంటర్ లో అయితే 1100 రోజుల పాటు ఆడింది. ఇదెలా ఉంచితే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు బాలయ్య సినిమాలకు పెట్టనికోట. బాలయ్య సినిమా హిట్ అయింది అంటే చాలు అక్కడ వంద రోజులు ఆడాల్సిందే.
ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 11 బాలకృష్ణ సినిమాలు నాలుగు ఆటలతో షిఫ్తింగ్ లేకుండా వంద రోజులకు పైగా ఆడాయి. ఇంత గొప్ప రికార్డ్ ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కరే. ఎమ్మిగనూరులో వంద రోజులు డైరెక్ట్ గా ఆడిన బాలయ్య సినిమాల లిస్టు చూస్తే… పెద్దన్నయ్య, సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, చెన్నకేశవ రెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్రా శాతకర్ణి, జైసింహ… ఈ సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి. లెజెండ్ అయితే 421 రోజులు ఆడితే… సమరసింహారెడ్డి 177 రోజులు, నరసింహనాయుడు 176 రోజుల పాటు ఆడాయి. నాలుగు ఆటలతో వంద రోజుల పాటు ఆడాయి.
Also Read:నానీ భార్యకు ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా…?