బాలయ్య కొత్త లుక్ వెనక సీక్రెట్.. - Tolivelugu

బాలయ్య కొత్త లుక్ వెనక సీక్రెట్..

హైదరాబాద్‌: బాలయ్య ఏం చేసినా సంచలనమే. ఎన్టీఆర్ తరువాత.. ఎన్నికల తర్వాత పెద్దగా వార్తాల్లోకి రాని బాలకృష్ణ తర్వాత తన కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. చాలారోజులుగా ఆయన ఎవరికీ కనిపించడమే లేదు. ముఖ్యంగా మీడియా కంటపడలేదు.

ఒక్కసారిగా బయటికి వచ్చిన బాలయ్య కొత్త ఫొటో అందరికీ షాక్ ఇచ్చింది. కొత్త లుక్‌లో బాలయ్య చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఫాన్స్ అయితే బాలయ్యా.. నీ వయస్సు 40 దగ్గరే ఆగిపోయిందయ్యా.. అంటున్నారు.

యంగ్‌గా కనిపించేందుకు బాలయ్య ట్రెండీగా తయారయినట్టు ఈ ఫోటో చూసినవారికి అర్ధం అవుతుంది. తన తదుపరి మూవీ కె.ఎస్‌ రవికుమార్ దర్శకత్వంలో వస్తోంది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక బాలయ్యకు జోడీగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, భూమిక, జయసుధ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చిరంతన్‌ భట్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. జైసింహా’ తర్వాత బాలకృష్ణతో నిర్మాత సి.కల్యాణ్, కె.ఎస్. రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో బాలయ్య డాన్‌గా కనిపించపోతున్నట్టు సమచారం.

Share on facebook
Share on twitter
Share on whatsapp