నవరస నటనా సార్వభౌమ, రాజకీయ భీష్మ, ప్రజాభీష్ట నందమూరి తారక రామ మహాప్రస్థానాన్ని పాటగా రచించి, నిర్మించిన అశ్విన్ అట్లూరి గారికి, వారి టీం కి అభినందనలు తెలిపారు నందమూరి బాలకృష్ణ.
ఓ ప్రజానాయకా, తెలుగుతల్లి పాడుతుంది నీ గీతికా నందమూరి తారక రామామృత… గీతాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న అన్నగారి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు కృతఙ్ఞతల ని అన్నారు బాలయ్య.
ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక సినిమాల విషయానికొస్తే నందమూరి బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.