తండ్రి మీద తీసిన బయోపిక్-సిరిస్ ఘోరంగా ఫెయిలై.. ఇటు పోటీ చేసిన పార్టీ పవర్‌లోకి రాక పాలిటిక్స్‌లో కూడా పనిలేకుండా పోయిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మూవీలపైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. వరుస సినిమాలతో మాంచి జోష్ మీదున్నాడు. దసరా కానుకగా ఓ సర్ప్రైజ్ తెస్తున్నాడని తాజా ఇన్ఫర్మేషన్. తన 105వ సినిమా టీజర్ ఆరోజు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్ బయటికి వచ్చింది.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తీస్తున్న బాలయ్య న్యూ మూవీ శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఈమద్యనే మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని యాక్షన్ సీన్లు అన్బు-అరివు ఫైట్‌మాస్టర్లు తెరకెక్కించారు. బాలకృష్ణ తన సీన్లకు సంబంధించిన డబ్బింగ్ కూడా చెబుతున్నట్టు మూవీ యూనిట్ నుంచి సమాచారం. సోనాలా చౌహాన్, వేదిక కథానాయికలు. ప్రకాష్‌రాజ్, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో కనపించనున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు.
ఈ మూవీ తరువాత వెంటనే బోయపాటితో బాలకృష్ణ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. బాలయ్య 106వ చిత్రం బోయపాటితో చేస్తున్నట్లు ద్వారకా క్రియేషన్స్ సంస్థ ట్విటర్‌లో ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ – పూరీ కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోందని తొలివెలుగు ముందే ప్రకటించింది. దానికి సంబంధించిన స్టోరీ లైన్ రెడీ చేసుకుని వినిపించడానికి పూరి సిద్ధం అవుతున్నట్టు ఇన్ఫో.
ఇలావుంటే, బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం వీడియో క్లిప్ ఒకటి బయటికొచ్చి హల్‌చల్ చేస్తోంది. హీరోయిన్‌తో కలిసి హీరో ఎయిర్‌పోర్టులో ఎస్కలేటర్ దిగుతున్నట్టు ఈ విజువల్స్‌లో కనిపిస్తోంది. ఇద్దరి మధ్యా ఏదో సీరియస్ డిస్కషన్ నడుస్తున్నట్టుగా అర్ధం అవుతోంది.