థియేటర్లలో ఇతర హీరోల సినిమాలు చూసే అలవాటుకు నందమూరి బాలకృష్ణ చాలా దూరం. ఆ విషయాన్ని ఆయనే ఓపెన్‌గా చెప్పేస్తుంటాడు చాలా సార్లు. అలాంటి బాలయ్య.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ చూశాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి. బాలయ్య కోసం ఆ సినిమా నిర్మాతలు స్పెషల్ షో వేసారు. సాధారణంగా ఎవరు పిలిచినా స్పెషల్ షోలకు వెళ్లని బాలయ్య ఉప్పెన మూవీని చూడటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలయ్య ఉప్పెన మూవీ చూడటానికి కారణం.. తన వారసుడు మోక్షజ్ఞ కోసమేనని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ డెబ్యూని అద్భుతంగా తెరకెక్కిన విషయాన్ని తెలుసుకున్న బాలయ్యా.. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఈ మూవీని చూసాడు. సినిమా అయ్యాక చాలా సేపు బుచ్చితో మాట్లాడాడు. సినిమా బాగా తీసావని అభినందించాడు. బుచ్చిబాబు సినిమా తీసిన విధానం నచ్చడంతో మోక్షజ్ఞ ఎంట్రీ బుచ్చిబాబు చేతిలోనే ఉంటుందని టాక్.