ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరని లోటు అని అన్నారు.
7 దశాబ్దాల్లో 30 కి పైగా భాషల్లో 30 వేల పాటలు పాడటం లతా మంగేష్కర్ గాన మాధుర్యానికి నిదర్శనం అని అన్నారు. దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు, ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదన్నారు.
భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, అవార్డు లే కాదు, విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలు అందించి ఆమెను గౌరవించాయి అని తెలిపారు బాలయ్య.
ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చారు బాలయ్య.
Advertisements