ఇటీవల గత నాలుగైదు రోజుల నుంచి టాలీవుడ్ లో చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బిబి3 సినిమా రిలీజ్ డేట్ ను కూడా చేశారు. ఈ చిత్రాన్ని మే 28 రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అయితే గతంలో కూడా ఇద్దరూ ఓసారి బరిలో దిగారు. 2008 జనవరి 10న బాలయ్య బాబు ఒక్కమాగాడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ కృష్ణ సినిమా తో జనవరి 11న ఒక్క రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే బాలయ్య సినిమా ఒక్కమగాడు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కృష్ణ మాత్రం సూపర్ హిట్ సాధించింది. మరోసారి ఈ ఇద్దరూ పోటీ పడుతుండటంతో ఈసారి పైచేయి ఎవరు సాధిస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.