నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఇందులో నటించింది. ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాకిస్థాన్‌లో కూడా అఖండ చెలరేగిపోతుందని, అక్కడి నుంచి వాట్సప్ వీడియోలు వస్తున్నాయన్నారు.
అలాగే టికెట్స్ ధరల పై కూడా మరోసారి మాట్లాడారు బాలయ్య. ఏపీలో సినీ పరిశ్రమ వివాదంపై కలిసికట్టుగా ఉండాలన్నారు. టికెట్ ధరలపై సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సినిమా గోడును అక్కడ పట్టింకునే వాళ్లు ఎవరున్నారని అన్నారు.