బాలకృష్ణ డైలాగ్స్ తో బుల్లి బాలయ్యగా పేరుతెచ్చుకున్న గోకుల్ సాయికృష్ణ మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు బాలకృష్ణ. చిత్తూరు కు చెందిన గోకుల్… జ్వరంతో గత రెండురోజుల క్రితం బెంగుళూర్ రెయిన్ బో హాస్పిటల్ లో చేరాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం గోకుల్ మృతి చెందాడు. ఇంత చిన్న వయసులో గోకుల్ చెప్పే డైలాగ్లు హావభావాలు చూడటానికి చాలా బాగుండేవి. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న గోకుల్ మృతిని నేను జీరించించుకోలేకపోతున్న, డెంగ్యూ తో మృతి చెందిన ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.