ఎన్‌బీకే 105వ మూవీ పేరు ‘రూలర్’ అని దాదాపు ఖాయం చేసినట్టు ఇన్ఫర్మేషన్. సినిమా పని చాలా వేగంగా జరుగుతోంది. నవంబర్ నాటికి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని అంచనా. ఈ మూవీ పూర్తయితే తరువాత బోయపాటి చిత్రం మొదలుపెట్టాలి. ఇక రూలర్ ప్రమోషన్లు కూడా షురూ అయ్యాయి. ఈ చిత్రంలో బాలయ్య గెటప్ ఇప్పటికే ఒకటి రివీలయ్యింది. గణేశ్ చతుర్ధి పండగ ముందు మరో లుక్ అభిమానుల కోసం రిలీజ్ చేశారు. బాలకృష్ణ కేరక్టర్ తన హిట్ ఫార్ములా ప్రకారం రెండు పార్శ్వాలలో కనిపిస్తుందని ఇన్ఫో. యంగ్ లుక్ కాకుండా మరో లుక్ త్వరలో రిలీజ్ చేస్తారట. దాని గురించే ఫాన్స్ వెయిటింగ్. బాలయ్యని కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » రూలర్ కారు దిగి వచ్చాడంటే..