కేఎస్ రవి కుమార్ దర్శకత్వం నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా రూలర్. డిసెంబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్ తో బాలయ్య తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదంటూ నిరూపించాడు. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మరో వైపు, యంగ్ లుక్ తో ప్రేక్షకులకు సినిమా పై ఆసక్తి పెంచేశాడు. ఈ సినిమా లో బాలకృష్ణ సరసన చౌనల్, వేదిక నటిస్తున్నారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, భూమిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా చిత్ర యూనిట్ షూట్ కంప్లీటెడ్ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ధర్మ పాత్రలో నటిస్తున్న బాలయ్య సరసన వేదిక నటిస్తుందని అర్ధం అవుతుంది. ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. టీజర్ తో, యంగ్ లుక్స్ తో బాలయ్య ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. డిసెంబర్ 20 న థియేటర్ లో ఏ మేర అలరిస్తాడో చూడాలి.