ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత వారం మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు సీఎం జగన్ ను కలిసి ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకొచ్చారు.
అయితే నేడు మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా జగన్ ని కలవబోతున్నారు. అయితే ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను సినిమా బడ్జెట్ పెంచను. నేను సీఎం జగన్ ను కలవను.
టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పుడే అఖండ సినిమా సక్సెస్ అయింది. సీఎంను కలవడానికి నన్ను రమ్మని పిలిచారు. నేను రాను అని చెప్పాను అంటూ నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చారు.
గతంలో అక్కినేని నాగార్జున కూడా ఏపీ లో ఉన్న టిక్కెట్ల రేట్లతో నా సినిమాకు సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.