నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. బాలకృష్ణ సినిమా లోనే కాదు… రియల్ లైఫ్ లో కూడా హీరోనే. ఈ విషయం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎంతో మంది పిల్లలకు ప్రాణదాత గా నిలిచాడు బాలయ్య. ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో ఎందరో ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన మణిశ్రీ అనే చిన్నారి గత కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ బసవతారకం ఆసుపత్రిలో జాయిన్ అయింది.
అయితే ఆ ఆపరేషన్ కి సుమారు 7 లక్షలు ఖర్చు అవ్వనుండగా… దాతల నుంచి ఎంత సాయం వచ్చినప్పటికీ 5 లక్షలకు పైగానే ఇంకా రావాల్సి ఉంది. దీనితో చిన్నారి తల్లిదండ్రులు బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిని కలిసి పరిస్థితి వివరించగా వారు ఈ విషయాన్ని బాలయ్యకు చేరవేశారు. దీనితో విషయం తెలిసిన బాలయ్య ఆ మిగతా 5 లక్షల 20 వేలు కి ఎలాంటి రుసుము చెల్లించవద్దని… దానిని మాఫీ చేసి ఆపరేషన్ చేయించారు.