నట’సింహం’..‘వీరసింహ’మై సంక్రాంతి బరిలోకి దూసుకొస్తుంది. మైత్రీమూవీస్ బ్యానర్ పై గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్ర భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతకొంత కాలంగా ఫ్యాక్షన్ చిత్రాలకు దూరంగా ఉన్న బాలయ్య తాజా చిత్రంతో కత్తిపట్టాడు. కేవలం గెటప్ తోనే ఉత్కంఠకు ఊపిచ్చాడు.
ఇప్పటికే రిలీజైన ‘జైబాలయ్య’,’సుగుణ సుందరి’, ‘మా బావ మనోభావాలు’ పాటలు ఫ్యాన్స్ కి పండగచేసాయి. తాజాగా రిలీజైన వీరసింహారెడ్డి ట్రైలర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అభిమానులతో ఈలలు వేయిస్తున్నాయి. ఫ్యాక్షన్ తరహా యాక్షన్ క్లిప్స్ దట్ ఈజ్ బాలయ్య అంటూ రెచ్చగొడుతున్నాయ్.
“సీమలో ఏ ఒక్కడు కత్తిపట్టుకో కూడదని నేను ఒక్కడినే కత్తిపట్టా..పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు సీమపై ఎఫెక్షన్, పుట్టింది పులిచర్ల,చదివింది అనంతపురం,రూలింగ్ కర్నూల్’ ‘పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ కైనా వెళ్ళి పదినిమిషాలు నిలబడు అక్కడ స్లోగన్ ఓ వినపడుతుంది.’, ’అపాయింట్ మెంట్ లేకుండా వస్తే అకేషన్ లొకేషన్ చూడను ఒంటిచేత్తో ఊచకోత’, ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో,కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’, ‘ పదవి చూసుకుని నీకు పొగరేమో, కానీ నాకు బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ’ లాంటి పదునైన డైలాగులు ట్రైలర్ లో కత్తులు దూస్తున్నాయ్.వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి థియేటర్స్ దద్దరిల్లేలా చేస్తుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది.