బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న బాలక్రిష్ణ తన నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు. తెలుగు హీరోలంతా కరోనా లాక్ డౌన్ లో వరుసగా సినిమాలకు సంతకం చేయగా…. బాలయ్య మాత్రం బోయపాటి సినిమా పైనే ఫోకస్ చేశారు. ఇప్పటికే సగం షూట్ పూర్తి కాగా, 2021 వేసవిలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేశారు.
ఇక డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు బాలయ్య కథలు వింటుండగా, డిక్టేటర్ సినిమా చేసిన శ్రీవాస్ దర్శకత్వంలో మరో మూవీకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. డిక్టేటర్ బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టగా…. శ్రీవాస్ తీసిన సాక్ష్యం కూడా ఆకట్టుకోలేదు. దింతో కాస్త గ్యాప్ తర్వాత శ్రీవాస్ కోన వెంకట్ తో కలిసి కథ రెడి చేయగా, బాలయ్య ఒకే చెప్పెశారు. బి.గోపాల్ మూవీ తర్వాత ఈ మూవీ పట్టాలెక్కనుంది.