నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. అంతేకాకుండా సీనియర్ నటుడు శ్రీకాంత్ ఓ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు. సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హైదరాబాదులోని సారథి స్టూడియోలో బాలయ్య సాంగ్ ని షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో బాలయ్య ప్రగ్యా జైస్వాల్ తో మాస్ స్టెప్స్ వేసి అలరించనున్నాడట. ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.