ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మొదటి సీజన్ అన్ స్టాపబుల్ షో చాలా రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా చేసిన ఈషో ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు, ప్రముఖులు, దర్శకులు, నటీనటులనీ ఇంటర్వ్యూ చేసిన ఈషో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ ఈనెల 14వ నుండి స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మొదటి ఎపిసోడ్ లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అల్లుడు లోకేష్ తో ప్లాన్ చేయడం జరిగింది.
ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ రాజకీయ నేత చంద్రబాబుతో ఈ ఎపిసోడ్ ప్లాన్ చేయడం అటు ఎంటర్టైన్మెంట్ పరంగా ఇటు పొలిటికల్ గా ఉత్కంఠ భరితంగా మారింది. హోస్ట్ గా బాలకృష్ణ చంద్రబాబు మరియు లోకేష్ లకి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది. ఇందుకు సంబంధించి అన్ స్టాపబుల్-2 ప్రోమో విడుదల అయింది. ఇందులో బాలయ్య సంధించిన ప్రశ్నలకు చంద్రబాబుతో పాటు లోక్ కూడా సమాధానమిచ్చారు.
అద్భుత ఇంట్రడక్షన్ ఇచ్చి చంద్రబాబును షోలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. బాలకృష్ణ తన ఎనర్జీతో ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ఈ సందర్భంగా మొదటి ఎపిసోడ్ కి నా బంధువును పిలుద్దామనుకున్నా.. కానీ అందరి బంధువు అయితే బాగుంటుందని.. మీకు బాబు.. నాకు బావ.. చంద్రబాబు నాయుడును ఆహ్వానించా. భారతదేశంలోని దిగ్గజ రాజకీయ నాయకులలో ఒకరైన చంద్రబాబుకు స్వాగతం అంటూ బాలకృష్ణ ఆహ్వానం పలికారు.
Baala-Chandrulu Ekam aite, Sanchalanalu Charchakoste, Prapancham toli sari Rendu Telugu Velugula Sandhadi chudabotunte “Debbaki Thinking Maripoddi”.
▶️https://t.co/a37G6aa0y5#UnstoppableWithNBKS2 episode 1 premieres October 14. pic.twitter.com/53ZFEos0Zq
— ahavideoin (@ahavideoIN) October 11, 2022
తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని.. అందులో మొదటిది భార్య వసుంధర, పిల్లలు అని.. రెండోది క్రిత సంవత్సరం స్టార్ట్ అయిందని.. దాంతో డీప్ గా కనెక్ట్ అయిపోయా అని అన్ స్టాపబుల్ ని ఉద్దేశించి అన్నారు బాలయ్య. దానికి బాబు స్పందిస్తూ.. ఈ బ్రేకింగ్ న్యూస్ వెంటనే వసుంధరకి చెప్పాలి అంటూ చమత్కరించారు. ఆ తర్వాత మీ జీవితంలో చేసిన మోస్ట్ రొమాంటిక్ పని ఏంటి అని బాలయ్య ప్రశ్నించగా.. నీకంటే ఎక్కువే చేశా. మీరు సినిమాల్లో చేస్తే.. నేను స్టూడెంట్‌గా చేశా అంటూ సరదాగా చెప్పారు చంద్రబాబు. దీనికి బాలయ్య స్పందించి మీరు ఎంతైనా ముందుచూపు కలవారు. అందుకే రాళ్లు రప్పలు ఉన్న హైదరాబాద్ ని ఎంతో అద్భుతంగా మార్చారని అన్నారు. అప్పుడు బాహుబలి రాలేదు కాబట్టి.. ఎవరూ గ్రాఫిక్స్ అనలేరని అన్నారు బాలయ్య.
తర్వాత నారా లోకేశ్ ఎంట్రీ ఇచ్చి షోను రక్తికట్టించారు. మీ నాన్నను వేరే గెటప్‌లో చూశావా అని మామ అడిగిన ప్రశ్నకు ‘ఆయన ఎప్పుడూ ఇదే గెటప్‌లో ఉంటారు’ అని చెప్పారు లోకేశ్. అనంతరం కొద్దిసేపు హోస్ట్ గా వ్యవహరించిన లోకేష్.. మామ, తండ్రిలపైన ప్రశ్నల వర్షం కురింపించారు. ఇక ఆ తర్వాత మొత్తం నందమూరి వారి ప్రశ్నలు, నారా వారి సమాధానలు నవ్వులు పూయించాయి. మొత్తానికి అన్ స్టాపబుల్-2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందని ఎదురుచూస్తున్నారు.