నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే మరోవైపు అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె షో కూడా చేస్తున్నాడు. ఈ షో లో మోహన్ బాబు, హీరో నాని, అలాగే అనిల్ రావిపూడి, బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షో లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అడుగు పెట్టినట్లు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ శనివారం స్టార్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు మహేష్, బాలయ్య మధ్య సంభాషణ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.