హీరో నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బాలయ్య కు ఎంత కోపమో అంత మంచి మనసు కూడా ఉందని చాలా మంది అంటుంటారు. అయితే బాలయ్యకు పురాణాల మీద ఎంతటి పట్టుఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి డైలాగ్ అయినా బాలయ్య గుక్క పెట్టుకోకుండా చెప్తారు.
అలాంటి బాలయ్య దగ్గర పురాణాల గురించి అనవసరంగా ఒక పదం నోరుజారితే ఇంక అంతే. అయితే ఇటీవల బాలయ్యను ఓ టాలెంటెడ్ దర్శకుడు కలిశాడట. నిర్మాత అభ్యర్థన మేరకు బాలయ్య దగ్గరకు వెళ్లిన దర్శకుడు జ్యోతిష్యం, గ్రహాల గురించి కొంచెం మాట్లాడుకున్నారట.
నిజానికి అక్కడ ఆ దర్శకుడు తన నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రయత్నించాడట. కానీ జ్యోతిష్య పఠనాల విషయం లో బాలయ్య టాప్ అనే సంగతి అందరికీ తెలుసు. అలాంటి బాలకృష్ణ దగ్గర ప్రదర్శనలు చేస్తే ఊరుకుంటాడా!!
వెంటనే జ్యోతిష్య విషయాలపై అవగాహన లేక, అర్థరహితమైన ఆలోచనలతో మాట్లాడవద్దని ఆ దర్శకుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట. అయితే బాలయ్యను కలిసిన ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.