అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. కొన్ని సినిమాలతో ఆయన క్రేజ్ పడిపోయినా ఆ తర్వాత మాత్రం ఆయనతో సినిమా చేయడానికి యువ దర్శకులు ఎందరో పోటీ పడుతున్నారు. ఒకప్పటి మాదిరిగా బాలయ్య మళ్ళీ ఫుల్ స్వింగ్ లో కనపడుతున్నారు. బాలకృష్ణ సినిమాల దెబ్బకు యువ హీరోలు కూడా భయపడుతున్నారు.
Also Read:భీమ్లా నాయక్ లో సునీల్ పాత్రను త్రివిక్రమ్ కావాలనే కట్ చేశాడా ?
ఇప్పుడు గోపీ చంద్ మలినేని, అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమాలు చేస్తున్నారు. ఇక ఇదెలా ఉంటే… బాలయ్య వసుంధర దంపతులు సోషల్ మీడియాలో కాస్త హాట్ టాపిక్ అయ్యారు. రానా షో తర్వాత వీరి మాట ఎక్కువగా వినపడుతున్నది. ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసిన బాలకృష్ణ కొడుకుని సినిమాల్లోకి తీసుకురావడానికి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక బాలయ్య, వసుంధర వైవాహిక జీవితం విషయానికి వస్తే… గత ఏడాది డిసెంబర్ 8 తో బాలయ్యకు పెళ్లి జరిగి నాలుగు దశాబ్దాలు పూర్తి అయింది. ఇక ఇప్పుడు వీరి శుభలేక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వసుంధర కుటుంబం ఈ శుభలేఖను ప్రింట్ చేయించారు. కాకినాడ వాస్తవ్యులు దేవరపల్లి సూర్యారావు, దేవరపల్లి ప్రమీలా రాణి దంపతుల ద్వితీయ కుమార్తెను భాగ్యనగరం వాస్తవ్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి పంచమ పుత్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్టుగా అందులో ఉంది. 8 వ తేదీ పగలు 12.41 నిమిషాలకు పెళ్లి జరిగింది. తిరుపతిలో కర్ణాటక కళ్యాణ మండపంలో వీరి పెళ్లి జరిగింది.