నందమూరి బాలకృష్ణ…టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరు. ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బాలకృష్ణ తన కుటుంబ సభ్యులను ఎక్కువగా బయటకు తీసుకురారు. బాలకృష్ణ భార్య వసుందర గురించి కూడా కొంతమందికే తెలుసు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా.. జూబ్లీహిల్స్ రోడ్ నం 2లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో వసుంధరకు ఖాతా ఉంది. అయితే ఆమె ఇటీవలే మొబైల్ బ్యాంకింగ్ కు దరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులకు దరఖాస్తు చేరింది. దీంతో బ్యాంకు రిలేషన్ షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఈ నెల 13న వసుంధరకు ఫోన్ చేశారు.
ఈ విషయాన్ని గురించి వసుంధరను అడగడంతో తాను ఎలాంటి దరఖాస్తు చేయలేదన్నారు. దీంతో ఈ మేరకు వసుంధర తరపున సుబ్బారావు అనే వ్యక్తి బ్యాంక్‌కు వెళ్లి వాకబు చేయగా బ్యాంకులో ఇటీవల కొత్తగా అకౌంటెంట్‌గా చేరిన కొర్రి శివ అనే వ్యక్తి ఈ పని చేసినట్లు బయటపడింది. మొబైల్ బ్యాంకింగ్ కోసం వసుంధర సంతకాన్ని సేకరించినట్లు అంగీకరించడంతో ఈ మేరకు సుబ్బారావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఫై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.