అన్ స్టాపబుల్ కోసం సోలోగా కూర్చోబెట్టే స్టార్లు దాదాపు అయిపోయారు. చిరంజీవిని మినహాయిస్తే, దాదాపు స్టార్ హీరోలందర్నీ బాలయ్య ఓ రౌండ్ చుట్టేశాడు. దీంతో సీజన్-2లో ఇద్దరేసి హీరోల్ని కూర్చోబెట్టడం స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా శర్వానంద్-అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ-విశ్వక్ సేన్ అంటూ ఇద్దరేసి చొప్పున కూర్చోబెట్టడం స్టార్ట్ చేశాడు.
ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా ముగిసినట్టు కనిపిస్తోంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో పాటు నటి రాధికను ఒకే షోలో చూపించారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు, సురేష్ బాబును ఒకే ఫ్రేమ్ లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ స్టాపబుల్ సీజన్-2 కొత్త ఎపిసోడ్ లో ఈ ముగ్గుర్నీ ఒకేసారి ఇంటర్వ్యూ చేయబోతున్నారు బాలయ్య. వీళ్లలో అరవింద్, సురేష్ బాబు నిర్మాతలు. మధ్యలో రాఘవేంద్రరావును ఎందుకు కూర్చోబెట్టారో అర్థం కావడం లేదు. నిజానికి రాఘవేంద్రరావు ఒక్కరితోనే అన్ స్టాపబుల్ చేయొచ్చు. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర చాలా స్టఫ్ ఉంటుంది. కానీ, ఎందుకు ఇలా గుంపులో కలిపేశారు.
అన్నట్టు ఇదే ఎపిసోడ్ లో కళాతపస్వి కె విశ్వనాథ్ ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వయసు రీత్యా ఇంటికే పరిమితమైన విశ్వనాథ్ ను జూమ్ లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తారంట.