నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని తో తన 107వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటో లీకైంది. అందులో నల్ల చొక్కా, లుంగీతో బాలయ్య కూర్చులో కూర్చుని కనిపించారు.
అయితే ఈ ఫోటో చూసిన వారికి కన్నడ చిత్రం మఫ్తీ గుర్తురాక తప్పదు. శివ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం మఫ్తీ 2017లో విడుదలైంది. ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ ఎలా అయితే కూర్చుంటారో బాలయ్య కూడా అదే స్టైల్, కాస్ట్యూమ్స్ తో కనిపిస్తున్నారు. సెట్ కూడా దాదాపు అదే విధంగా కనిపిస్తోంది.
దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేని మఫ్తీ కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలోని సిరిసిల్లలోషూటింగ్ జరుగుతుంది. రామ్-లక్ష్మణ్ కాంబినేషన్‌లో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.