బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అతనితోపాటు డాక్యుమెంట్ రైటర్ జియా ఉద్దీన్ కూడా ఉన్నాడు.
రిజిస్ట్రేషన్ కు సంబంధించి షేక్ షరీఫ్ అనే వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశాడు నిజాముద్దీన్. దీనికి జియా ఉద్దీన్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. అయితే షరీఫ్ ఏసీబీని ఆశ్రయించి జరిగిందంతా వివరించాడు. దీంతో పక్కా ప్లాన్ తో సబ్ రిజిస్ట్రార్ రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. విచారణ జరుగుతోంది.