గణేష్ నిమజ్జనం అనగానే… వెంటనే గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డూ వేలం. ఈ సారి వేలంలో లడ్డు ధర ఎంత పలికింది, వేలం పూర్తయిందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూసేవారే. ఆ లడ్డూలో ఏం మహిమ ఉందో కానీ ప్రతి సంవత్సరం లక్షల్లో ధర పెంచుతూనే ఉన్నారని చాలా మంది చర్చించుకుంటారు.
కానీ ముందుగా నిర్ణయించినట్లుగానే వైరస్ కారణంగా బాలాపూర్ గణేష్ వేలం పాటను రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రికి ఈ సారి బాలాపూర్ లడ్డు ఇవ్వనుంది.. బాలాపూర్ ఉత్సవ సమితి ప్రసాదం రూపమున ఈ లడ్డుని కెసిఆర్ గారికి అందచేయనుంది. ప్రతి ఏటా లక్ష యాభై వేలమంది ముందు జరిగే ఈ వేలంపాట ఈ సారి ఏమి హంగులు లేకుండా కెసిఆర్ కు చేరనుంది. దీంతో వేలం పాట లేకుండానే చరిత్రలో తొలిసారి బాలాపూర్ గణేష్ నిమజ్జన ఊరేగింపు ప్రారంభం అయ్యింది.
బాలాపూర్ గణేష్ వేలంపాట 1994 లో మొదలయ్యింది. కారణం ఏదైనా వేలం పాట రద్దు చేయటం ఇదే ప్రథమం. 1994 లో తొలి ఏడాది 450 కు బాలాపూర్ గణపయ్య లడ్డూను కొలను మోహన్ రెడ్డి సొంతం చేసుకోగా, 2019లో కొలను రాంరెడ్డి అనే భక్తుడు 17.60 లక్షల రికార్డు ధరకు బాలాపూర్ లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నాడు.