బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. 2019లో రూ.17.60 లక్షల దగ్గర ఆగిన వేలం ఈసారి రూ.18.90లకు వెళ్లింది. కడపకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి మర్రి శశాంక్ రెడ్డి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. కరోనా కారణంగా గతేడాది వేలం పాట జరగలేదు.
ఇక లడ్డూ వేలం పాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సహా పలువురు హాజరయ్యారు. అలాగే 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి కూడా వచ్చారు.
బాలాపూర్ లడ్డూను ఏపీ సీఎం జగన్ కు గిఫ్ట్ గా ఇస్తానన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే బాలాపూర్ లడ్డూ వేలానికి వస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు.