ఆదిత్య 369.. నందమూరి బాలకృష్ణ సినిమా జీవితంలో ఓ ప్రత్యేకమైన సినిమా. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాను తెరకెక్కించాలని బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. గతంలో బాలకృష్ణ వందవ సినిమా గా పట్టాలెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని అనూహ్య కారణాల వల్ల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెరమీదకు వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ల వల్ల ఈ సినిమాను పక్కకు పెట్టేశాడు బాలయ్య.
ఇప్పుడు ఈ కథకు కార్యరూపం ఇవ్వాలని బాలయ్య డిసైడ్ అయ్యాడని గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత ఆదిత్య 999 సినిమాని పట్టాలెక్కించాలని బాలయ్య ఆలోచిస్తున్నాడట.