బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా బిబి3 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ రోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ బాలయ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మహాశివరాత్రి కానుకగా ఈ మూవీ టైటిల్ ను మార్చి 11న ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక బాలయ్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ పూర్తిచేసుకుంది. తరువాత షెడ్యూల్ కోసం లొకేషన్ ల వేటలో బిజీగా ఉన్నారు బోయపాటి. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.