సినిమా పరిశ్రమలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అనే చెప్పాలి. అగ్ర హీరోల నుంచి చిన్న హీరోల వరకు క్రమ శిక్షణ లేకపోతే మాత్రం కెరీర్ దాదాపుగా నాశనం అయినట్టే. ఈ విషయంలో కొందరు హీరోలు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం క్రమశిక్షణ విషయంలో టైం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అనే మాట మనం వింటూనే ఉంటాం.
ఎన్టీఆర్ షూటింగ్ కి వెళ్ళే సమయంలో ఒక గంట ముందే సెట్స్ లో ఉంటారు అని చెప్తారు. అదే నందమూరి బాలకృష్ణకు కూడా వచ్చింది అంటారు ఆయనను దగ్గరగా చూసిన వాళ్ళు. అలాగే పెద్దలను గౌరవించే విషయంలో కూడా బాలకృష్ణ ఇలాగే ఉంటారట. నిర్మాతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్తున్నారు. ఎన్టీఆర్ విషయానికి వస్తే… ఒక సినిమా షూటింగులో అంజలీదేవి సెట్స్ కి ఆలస్యంగా వచ్చారట.
గుమ్మడి రాసుకున్న పుస్తకంలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంజలీ దేవి అలా చేయడంతో… షెడ్యూల్ ఆలస్యమైంది కాబట్టి ఆ సొమ్ము తనకు ఇవ్వాలని పంతం పట్టారని పేర్కొన్నారు. ఇక బాలకృష్ణ కూడా ఇటీవల ఒక సినిమా షూట్ లో ఇలాగే చేసారట. ఆమె షూట్ కి రాకుండా ఎవరికి చెప్పకుండా ఉండిపోయింది. దీనితో బాలకృష్ణ సీరియస్ అయి ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదు అని హీరోయిన్ కి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట.