నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. ఆయన కోపం గురించి మరీ చెప్పనవసరం లేదు. ఆయన ఏదైనా మీటింగ్ పెట్టారంటే అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక అభిమాని పని అయిపోయినట్టే. ఇంకా ఆ వీడియోలు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ వైరల్ అవుతూ ఉంటుంది.
కాగా ఈ రోజు నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. అయితే ఆ సమయంలో ఓ అభిమాని ఆయన మాట్లాడుతున్న సమయంలో మాటలకు అడ్డు వచ్చాడు. అంతే… ఇక బాలయ్య తన ఒరిజినాలిటీ చూపించేశారు. ఉష్.. ఎవడ్రా అది నోర్ ముయ్ అంటూ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ ఇక గతంలో కూడా ఎన్నోసార్లు తన చెయ్యికి కూడా పని చెప్పిన సంగతి తెలిసిందే.