నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బిబి3. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన లెజెండ్, సింహ వంటి చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు.. అందులో ఒక పాత్ర లో బాలయ్య అఘోరా గా కనిపించబోతున్నాడు.
అయితే మరో పాత్రకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఆ పాత్రలో బాలయ్య పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరోవైపు పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా సీనియర్ నటుడు శ్రీకాంత్, యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.