ఫ్యాక్షన్ సినిమాలు చేయాలంటే నందమూరి బాలకృష్ణ. రెండు దశాబ్దాల నుంచి ఆయన ఫ్యాక్షన్ సినిమాలతో సందడి చేస్తూనే ఉన్నారు. త్వరలో వచ్చే సినిమా కూడా ఫ్యాక్షన్ సినిమానే కావడం విశేషం. ఇక ఆ సినిమా షూటింగ్ కూడా రాయలసీమలోనే చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండే రాయలసీమలో బాలయ్యకు మంచి క్రేజ్ వచ్చింది. దానికి ఆయన సినిమాలే కారణం.
ఇక ఆయనకు కొన్ని సెంటర్స్ మాత్రం బాగా లక్కీ సెంటర్స్ గా చెప్తారు. అక్కడ బాలయ్య సినిమా దిగింది అంటే… దానికి హిట్ టాక్ వచ్చింది అంటే చాలు ఇక వందల రోజులు ఆడుతూ ఉంటాయి సినిమాలు. ఆ సెంటర్స్ యేవో ఒకసారి చూద్దాం. ఎమ్మిగనూరు – కోవెలకుంట్ల – నంద్యాల – ప్రొద్దుటూరు – హిందూపురం – ఆదోని బాలయ్యకు బాగా లక్కీ సెంటర్స్. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కూడా ఆయన సినిమాలు ఎక్కువ రోజులు ఆడాయి.
లెజెండ్ అయితే ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరులో ఏకంగా 400 రోజులు ఆడగా… ప్రొద్దుటూరులో అయితే లెజెండ్ 1005 రోజులు ఆడి సరికొత్త టాలీవుడ్ రికార్డు క్రియేట్ చేసింది. ఎమ్మిగనూరు టౌన్‌లో బాలకృష్ణ ఫ్లాప్ సినిమాలు కూడా వంద రోజులు ఆడాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సీడెడ్ లో వంద రోజులకు పైగా ఆడాయి. నరసింహనాయుడు సినిమా 105 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోగా… 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం ఒక ఇండియన్ సినిమాకు అదే రికార్డు.