నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. మరోవైపు ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే టైటిల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ ఖరారు చేస్తారని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్ తో మొదలయ్యే చిత్రాలు బాలయ్యకు మంచి హిట్లు సాధించి పెట్టాయని..ఉదాహరణకు మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య ,మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య చిత్రాలు మంచి హిట్ ను సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ అయితే బాగుంటుందని బాలయ్య,బోయపాటి ఆలోచిస్తున్నారట.