న్యాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటరైన్మెంట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాను సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న నిర్మాత గారపాటి తన తర్వాత సినిమా బాలయ్య తో అని తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నానని… వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోంది అని తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని…ఎఫ్ 3 షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అనిల్ దృష్టి పెడతారని తెలిపారు గారపాటి.