నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు బిబి3 చిత్రం రాబోతున్న పి సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు గణ విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ రోర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే నందమూరి అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ దర్శక నిర్మాతలు చిత్ర రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. మే 28 న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.