డిసెంబర్ 20న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే సినిమాకి పోటీగా రిలీజ్ అవుతున్న బాల్లయ్య రూలర్ నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో, టోనీ స్టార్క్ లుక్ లో బాలకృష్ణ సూపర్ గా ఉన్నాడు. ఎప్పుడు కాస్త లావుగా కనిపించే బాలయ్య మొదటిసారి ఇలా స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించడంతో నందమూరి అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నారు. రూలర్ సినిమాలో డ్యూయల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు, అందులో మోడరన్ లుక్ కోసమే బాలయ్య ఇలా మారాడు అనే విషయం బయటకి వచ్చింది. అయితే రూలర్ కోసం బాలయ్య స్టైలిష్ లుక్ లోకి మారడం నిజమే కానీ స్లిమ్ అవ్వడం వెనక ఉన్నది మాత్రం బోయపాటి శ్రీను.
ఇప్పటికే రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చిన ఈ ఊరమాస్ కాంబినేషన్ రిపీట్ అవుతూ త్వరలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. భారీ బడ్జట్ లో, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసమే బాలకృష్ణ బరువు తగ్గుతున్నాడు. దాని ఔట్పుట్ నే ఇప్పుడు మనం రూలర్ సినిమా పోస్టర్ లో చూస్తున్నాం. కేఎస్ రవికుమార్ కొత్త బాలకృష్ణని స్టైలిష్ గా చూపిస్తుంటే, బోయపాటి ఇంకేరేంజులో చూపిస్తాడో అంటూ నందమూరి అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటికైతే రూలర్ సినిమాతో బాలకృష్ణ డిసెంబర్ వార్ ని వన్ సైడ్ చేయాలని చూస్తున్నాడు.