బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ అంటే ఇప్పటికీ ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే ఫాన్స్ కచ్చితంగా ఎదురు చూసే వారు. 17 సినిమాలు చేస్తే 16 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరికి సంబంధించిన గాసిప్ ఇప్పుడు వచ్చినా ఆసక్తికరంగా చూస్తూ ఉంటారు.
Also Read:టాలీవుడ్ స్టార్స్ భార్యల వ్యాపారాలు…!
అయితే ఒక్క సినిమా మాత్రం కొన్ని కారణాలతో ఫ్లాప్ అయింది. కథా నాయకుడు నుంచి మొదలైన వీరి విజయ యాత్ర నిప్పు రవ్వ వరకు కొనసాగింది. కథానాయకుడు, పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, భానుమతి గారి మొగుడు, భానుమతి గారి మొగుడు, మువ్వ గోపాలుడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, భలే దొంగ, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, తల్లి తండ్రులు, రౌడీ ఇన్స్పెక్టర్, నిప్పురవ్వ
ఇందులో ఫెయిల్ అయిన సినిమా సాహస సామ్రాట్. ఈ సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. టైటిల్ కూడా వివాదం అయింది ఈ సినిమాకు. మొదట సామ్రాట్ అనే టైటిల్ తో ఈ సినిమాను స్టార్ట్ చేసారు. కాని సామ్రాట్ అనే టైటిల్ ను కృష్ణ రిజిస్టర్ చేసుకోగా వివాదం తలెత్తింది. ఇక ఈ సినిమా కథ కూడా తీవ్ర వివాదం అయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ముద్దుల మావయ్య సినిమా పరిశ్రమను ఊపేసింది.
Also Read:ట్రోలర్స్ పై మంచు యువసేన ఫైర్