అఖండ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అందరికి తెలిసిందే. ఇక ఆహా షో సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ ఇప్పుడు బిజీ బిజీగా గడుపుతున్నారు అనే చెప్పాలి. ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆయన ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా టాలీవుడ్ వర్గాల్లో జోరుగానే సాగుతుంది.
ప్రస్తుతం బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో నటించారు. ఈ సినిమాను మరో రెండు రోజుల్లో చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తుంది. ఇక ఫ్యాక్షన్ నేపధ్యంతో వచ్చిన బాలకృష్ణ సినిమాలు అన్నీ దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి అనే చెప్పాలి. ఇప్పుడు వస్తున్న సినిమా కూడా ఫ్యాక్షన్ నేపద్యంతోనే వస్తుండటంతో ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంచితే బాలయ్య వీర సింహారెడ్డికి సంబంధించిన లుక్స్ బాగా వైరల్ గా మారాయి. ఇక ఈ లుక్స్ లో బాలయ్య చేతికి ఒక వాచ్ ఉంటుంది. ఆ వాచ్ ఫొటోస్ ఫాన్స్ బాగా షేర్ చేస్తున్నారు. ఈ వాచ్ ధర దాదాపుగా 25 లక్షలు కావడం విశేషం. ఆ వాచ్ ను బాలకృష్ణకు నారా బ్రాహ్మణి గిఫ్ట్ గా ఇచ్చారట. ఈ వాచ్ ధరించే బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరు కావడం విశేషం.