నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సుల్తాన్ సినిమాది ప్రత్యేక పాత్ర. ఆ సినిమా బాలకృష్ణ స్థాయిని ఒక హీరోగా మరింత పెంచింది అంటారు. ఈ సినిమాలో బాలకృష్ణ నటన ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయనకు నటన మీద మక్కువ ఏ స్థాయిలో ఉందో ఈ సినిమా నిరూపిస్తుంది అనే చెప్పాలి. ఎలాంటి సన్నివేశంలో అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నటించారు బాలకృష్ణ.
అయితే ఈ సినిమా హిట్ కావడం వెనుక పెద్ద కథ ఉంది. అది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. సమరసింహారెడ్డి తర్వాత అదే 1999లో సుల్తాన్ వచ్చింది. పిబీఆర్ట్స్ బ్యానర్ పై శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా రోజా – రచన – దీప్తి భట్నాగర్ నటించగా బాలకృష్ణ ఏకంగా 8 పాత్రల్లో కనపడతారు. బాలకృష్ణ – కృష్ణంరాజు – కృష్ణ వంటి స్టార్ హీరోలతో వచ్చింది ఈ సినిమా.
1999 మే 27న వచ్చిన ఈ సినిమాపై అప్పుడు కొందరు కుట్ర చేసారనే వార్తలు వచ్చాయి. మీడియాలో సినిమాపై బాగా నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసి వచ్చిన చాలా మంది సినిమా బాలేదని అన్నారు. పత్రికల్లో కూడా అప్పుడు వచ్చింది. కాని మౌత్ టాక్ తో సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. మొదటి వారం ఎంత నెగటివ్ టాక్ తెచ్చుకుందో రెండో వారం అంతకు మించిన స్పీడ్ తో వెళ్ళింది.
Also Read: ఆ సినిమా కోసం చిరంజీవికి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారా?