భారత పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ అరుదైన ఘనత సాధించింది. రెండు వారాల తేడాలోనే నేపాల్‌లోని రెండు అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. ఎనిమిది వేల మీటర్ల ఎత్తయిన ఈ రెండు పర్వతాలు మౌంట్ కాంచనగంగ, మౌంట్ అన్నపూర్ణలను బల్జీత్ కౌర్ ఎక్కింది.
పర్వతారోహకురాలైన బల్జీత్ కౌర్ గురువారం ఉదయం తెల్లవారుజామున 4.20 నిమిషాలకు కాంచనగంగ పర్వతాన్ని ఎక్కింది. ఈ విషయాన్ని నేపాలీ షెర్పా పాసాంగ్ తెలిపారు. అలాగే, ఆమె ఏప్రిల్ 28వ తేదీన అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహించింది.
మౌంట్ కాంచన గంగ ఎత్తు 8586 మీటర్లు, మౌంట్ అన్నపూర్ణ ఎత్తు 8091 మీటర్లు.. రెండు వారాల తేడాలోనే ఈ రెండు పర్వతాలను అధిరోహించి అరుదైన ఫీట్ సాధించింది. ఇక ఈ నెలలోనే బల్జీత్ కౌర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ను ఎక్కనుంది.
బల్జీత్ కౌర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక గడిచిన వారం మహారాష్ట్రకు చెందిన ప్రియాంకా మెహితా 8 వేల మీటర్ల ఎత్తైన అయిదు శిఖరాలను ఎక్కింది.