తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ పథకాల వైపు దేశం చూస్తోందన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు బంధు పెట్టడం వల్ల 8 రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రంల ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకుని 12 రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నారు.
కంటి వెలుగును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ మందికి నేరుగా లబ్ధి చేకూర్చిన పథకం కంటి వెలుగు అని పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కంటి అద్దాలను అందించడం జరిగిందన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి 200 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో 1500 వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల జిల్లాలో 484 క్యాంపులు 40 వైద్య బృందాలు జిల్లా వ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు. తెలంగాణలో ఏ అభివృద్ధి జరుగుతుందో.. పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో చర్చ జరగాలన్నారు విప్ బాల్క సుమన్.