జగ్గారెడ్డి ఖబర్దార్.. నీదేం చరిత్ర, నాదేం చరిత్రో తెలుసుకోవాలని అన్నారు సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఉద్యమంలో దెబ్బలు తిని జైళ్లకు పోయిన చరిత్ర తనదని అన్నారు సుమన్. ఉద్యమానికి ద్రోహం చేయడంతో పాటు.. ఉద్యమకారులను కొట్టించిన చరిత్ర మీ కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. నాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పక్కన చేరి ఉద్యమానికి ద్రోహం చేసిన వ్యక్తివంటూ జగ్గారెడ్డిపై ఫైర్ అయ్యారు. మీరు ఏ ధోరణితో మాట్లాడితే తాను అదే ధోరణితో మాట్లాడుతానని కౌంటర్ ఇచ్చారు.
ప్రశాంతంగా ఉన్న ఓయూలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు రాహుల్ గాంధీ పర్యటన చేయబోతున్నారా? అని మండిపడ్డారు. ఉద్యోగాల నోటిఫికేషన్ రావడంతో అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నారని.. అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ పరిధిలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడదని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఎంబీఏ, పీజీ పరీక్షలు జరుగుతున్నాయని.. సభపెట్టి విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేయొద్దని పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తోంది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. అది భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసిన అన్యాయాలను కడుక్కుంటున్న పాపాలయాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు సుమన్. ప్రజాసంగ్రామ యాత్రలో ప్రజలెవరూ లేరని ఎద్దేవా చేశారు. బీజేపీ కావాలనే విద్వేషాలతో ప్రజలను రెచ్చగొడుతోందని.. కేంద్ర మంత్రి సభలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిని అడ్డుకున్నట్లుగా తాము బీజేపీ నేతలను అడ్డుకోలేమా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఒక్క ఆదేశం ఇస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవ్వరు కూడ బయట తిరగలేని హెచ్చరించారు.
కేటీఆర్.. రజాకార్ ఫైర్స్ సినిమా తీస్తానన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సుమన్.. తంబాకు ఫైల్స్, లవంగం ఫైల్స్ సినిమా తీస్తామని విమర్శాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ అసమర్ధ పాలన వల్ల దేశంలో బొగ్గు కొరత వచ్చిందని అన్నారు. 650 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి బొగ్గు రవాణా కోసం వాడుకున్న సిగ్గులేని ప్రభుత్వం బీజేపీదని మండిపడ్డారు. ఉద్యమంలో పోలీసుల తూటాలకు భయపడకుండా పోరాటం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు బాల్క సుమన్.