దేశవ్యాప్తంగా కొత్త రాష్ట్రపతి ఎన్నిక సందడే నెలకొని ఉంది. దానికి సంబంధించిన ఓటింగ్ నిన్న ముగిసింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఎన్నికల్లో పాలు పంచుకున్న బ్యాలెట్ బాక్సులు రాజధానికి చేరుకునే క్రమంలో ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందన్న విషయం తెలిసిందే.
ప్రతి బాక్సుకు విమానంలో మిస్టర్ బ్యాలెట్ బాక్స్ పేరిట ఇ టికెట్ తీసుకుంటారు. మిస్టర్ బ్యాలెట్ బాక్స్ దీనికి విమానం మొదట వరుసలో సీటు కేటాయిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నిఘాలో వీటిని ఢిల్లీలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తున్నారు.
వీటి ప్రయాణానికి సంబంధించిన చిత్రాలను ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మొత్తం 4,796 మంది ఓటర్లకు గాను 99.12 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 21ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు.
బ్యాలెట్ బాక్సుకు ప్రత్యేక టికెట్టు ఎందుకనే దానికి గతంలో ఎన్నికల సంఘం సమాధానమిచ్చింది. ఈ బ్యాలెట్ బాక్సులు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోని అత్యున్నత పదవి రాతను ఇవి నిర్ణయిస్తాయి. వీటి తరలింపు భద్రపరిచే విషయంలో ప్రత్యేక విధానాన్ని పాటిస్తున్నాం. అందుకే ఎన్నికల అధికారి పక్కన విమానంలో మొదటి వరుసలో మిస్టర్ బ్యాలెట్ బాక్స్ పేరిట ఇవి ఢిల్లీకి చేరుకుంటాయి అని వెల్లడించారు.
Polled Ballot Box of Presidential Election being taken by Air India flight from Kolkata to New Delhi. ARO is accompanying.#PresidentialElections2022 @ECISVEEP @SpokespersonECI @anuj_chandak @rajivkumarec pic.twitter.com/Ov1GnEdVGb
— CEO West Bengal (@CEOWestBengal) July 19, 2022
Advertisements