తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఉదయం అసెంబ్లీ ఛాంబర్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆయన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇది వరకే ప్రకటించారు. నామినేషన్ ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం లాంఛనప్రాయమే కానుంది.
అసెంబ్లీ ఛాంబర్ లో ఈ రోజున మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు బండ ప్రకాష్ అందజేశారు. నామినేషన్ సమయంలో మంత్రుల కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆయన వెంట ఉన్నారు.
1981లో బండ ప్రకాశ్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 1981-84 వరకు వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్, వైస్ చైర్మన్ గా పని చేశారు. ఆ తర్వాత 1982-83, 1984-85లో ‘కుడా’సభ్యులుగా ఆయన పని చేశారు. 2,