హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురంలో దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో దత్తాత్రేయ, ఆయన పీఏ, డ్రైవర్ ఉండగా.. పీఏకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మిగిలిన వారెవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంలో కారు కొంత దెబ్బతింది. దీంతో దత్తాత్రేయ వేరే వాహనంలో వెళ్లారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.