తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీచేశారు. భగీరథ్‌పై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు 41-ఏ సీఆర్‌పీసీ కింద దుండిగటల్ పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు.
పోలీసుల నోటీసులకు భగీరథ్ సమాధానం ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. పోలీసలు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. ఇప్పటికే ఆయన ఓ సారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
తన దగ్గర ఉన్న వివరాలను పోలీసులకు భగీరథ ఇచ్చారు. అవసరాన్ని బట్టి విచారణకు మళ్లీ పిలుస్తామని పోలీసులు ఆయనతో అన్నారు. మహీంద్రా యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ అనే విద్యార్థిపై బండి భగీరథ దాడి చేశాడంటూ వర్సిటీ క్రమశిక్షణా సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వర్సిటీ క్యాంపస్ లోనే ఈ దాడి జరిగిందని వారు ఫిర్యాదుల్లో చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. దీంతో భగీరథ్‌పై దుండిగల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటీవల శ్రీరామ్ అనే విద్యార్థిపై భగీరథ దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.